Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..సొంత డబ్బులతో ఆటస్థలం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..సొంత డబ్బులతో ఆటస్థలం

Pawan Kalyan has donated 60 lakhs to acquire land for Playground | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan ) ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

రైల్వే కోడూరు ( Railway Kodur ) నియోజకవర్గం, మైసూరవారిపల్లి ( Mysorevaripalli ) గ్రామంలోని పాఠశాలకు రూ.60 లక్షల సొంత నిధులతో ఆటస్థలం కొనుగోలు చేసి ఇచ్చారు.

ఆగస్ట్ నెలలో మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సందర్భంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం ( Playground ) లేదన్న విషయాన్ని విద్యార్ధుల తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో దసరాలోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని పవన్ మాటిచ్చారు.

ఇందులో భాగంగా బుధవారం రాత్రి మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన భూమిని అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీకి అందజేశారు.

ఈ స్థలాన్ని మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ట్రస్టు ( Trust ) ద్వారా రూ.60 లక్షలు వెచ్చించి ఎకరం స్థలం కొనుగోలు చేసి పవన్ కళ్యాణ్ ఇచ్చారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions