Monday 13th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > విజయ్ కు సలహా..పవన్ ఏం చెప్పారంటే!

విజయ్ కు సలహా..పవన్ ఏం చెప్పారంటే!

Pawan Kalyan on Thalapathy Vijay political entry | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ తన విభిన్నమైన శైలిని మరోసారి చాటుకున్నారు.

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యువతతో ముఖాముఖిగా నిర్వహించిన ‘జనసేన విత్ జెన్ జీ’ (Janasena with Gen Z) కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సమావేశంలో ఒక యువతి.. “తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో విజయ్ గారికి మీరు ఏమైనా రాజకీయ సలహాలు ఇస్తారా?” అని ప్రశ్నించారు. దీనికి పవన్ కళ్యాణ్ ఎంతో స్పష్టతతో సమాధానం ఇచ్చారు.

“విజయ్ గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఒక పెద్ద స్టార్. రాజకీయాల్లోకి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. “నేను సాధారణంగా ఎవరికీ సలహాలు ఇవ్వను.

చివరికి నా పిల్లలకు కూడా ఏ విషయంలోనూ సలహాలు ఇచ్చి నియంత్రించను. ఎవరి నిర్ణయాలు వారు స్వయంగా తీసుకున్నప్పుడే వారు రాణించగలరు” అని పవన్ వివరించారు.

సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి రావడం సులభమే అయినా, ప్రజాక్షేత్రంలో నిలబడటం కష్టంతో కూడుకున్న పని అని పవన్ కళ్యాణ్ గారు గతంలోనే పలు సందర్భాల్లో చెప్పారు.

ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్న తరుణంలో, పవన్ గారు ఆయనకు ఉన్న హక్కును గౌరవిస్తూనే, సలహాలు ఇచ్చే స్థాయి తనది కాదన్నట్లుగా మాట్లాడటం ఆయన పరిణతిని సూచిస్తోంది.

ఏప్రిల్ 23న తమిళనాడు ఎన్నికలు జరగనున్న తరుణంలో, టీవీకే అధినేత విజయ్‌పై పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు మెగా అభిమానుల్లో, ఇటు దళపతి అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions