Pashamylaram reactor blast | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది.
సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ పేలుడుతో ప్రొడక్షన్ యూనిట్ ఉన్న భవనం కూలిపోయింది. మరో భవనానికి బీటలు వచ్చాయి.
ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో 10 మృతిచెందినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్, ఇస్నాపూర్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.
చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.