Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా షూటర్లు ( Shooters ) మను బాకర్ ( Manu Baker ), సరబ్ జోత్ ( Sarabjot Singh ) సింగ్ కాంస్య ( Bronze ) పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన విషయము తెల్సిందే.
భారత షూటర్లు ఒలింపిక్ ( Olympic ) మెడల్ సాధించడంతో యావత్ దేశం పులకించి పోయింది. అయితే కుమారుడు మెడల్ సాధించడం పట్ల సరబ్ జోత్ సింగ్ తల్లి మాత్రం సాదాసీదాగా స్పందించారు.
ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. పతకం గెలిచిన తర్వాత తల్లికి ఫోన్ ( Phone ) చేస్తే మళ్ళీ చేయమని పెట్టిసినట్లు చెప్పారు.
తాను ఫైనల్స్ ఆడే సమయంలో తన తల్లి టీవీ చూడదని, అది ఒక సెంటిమెంట్ ( Sentiment ) లాగా ఆమె భవిస్తుందని సరబ్ జోత్ పేర్కొన్నారు.