Pakistan’s T20 World Cup 2026 squad | టీ-20 వరల్డ్ కప్ కోసం జట్టు ప్రకటించింది దాయాధి పాకిస్థాన్. 15 మంది ప్లేయర్లతో కూడిన టీంను తాజగా వెల్లడించింది. బంగ్లాదేశ్ కు మద్దతుగా పాక్ కూడా టీ-20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కథనాలు వచ్చాయి. దింతో తోక ముడిచిన పాక్ పొట్టి ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించింది. భారత్ లో భద్రతా కారణాల దృష్ట్యా తమ దేశ మ్యాచుల వేదికను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. కానీ ఆ దేశ జట్టుకు ఎలాంటి భద్రతా సమస్యలు ఉండవని చివరి నిమిషంలో వేదిక మార్చడం కుదరదని ఐసీసీ తేల్చి చెప్పడంతో టోర్నీ నుండి నిష్క్రమిస్తున్నట్లు బంగ్లా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నక్వీ స్పందిస్తూ..బంగ్లాదేశ్ పట్ల అన్యాయంగా వ్యవహరించారని, వరల్డ్ కప్ లో పాల్గొనే విషయంపై పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సంచలన ప్రకటన చేశారు. దింతో పాక్ పై ఐసీసీ సీరియస్ అయినట్లు కథనాలు వచ్చాయి. ఒకవేళ పాక్ టోర్నీ నుండి నిష్క్రమిస్తే తీవ్రమైన ఆంక్షలు విధించేందుకు ఐసీసీ అయిద్దమయ్యింది. ఈ తరుణంలో చేసేదేమీ లేక టీ-20 వరల్డ్ కప్ జట్టును పాక్ ప్రకటిస్తూ, దాయాధి దేశం టోర్నీలో భాగం అవుతుందని చెప్పకనే చెప్పింది.









