Padma Awards 2026 | 77వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఆదివారం పద్మా పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఐదుగురికి పద్మ విభూషన్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కార గౌరవం దక్కింది. టీం ఇండియా మాజీ సారథి, దేశానికి టీ-20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన మహారాష్ట్రకు చెందిన రోహిత్ శర్మను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఇకపోతే మహిళా ప్రపంచ కప్ ను దేశానికి అందించిన పంజాబ్ కు చెందిన హర్మన్ ప్రీత్ సింగ్ కౌర్ కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. బాలీవుడ్ సినిమాకు విశేష సేవ చేసిన దివంగత ధర్మేంద్రకు పద్మ విభూషన్ ను ప్రకటించారు. అలాగే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి పద్మ భూషణ్ ను ప్రకటించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 13 మంది తెలుగు ప్రముఖులకు పద్మ పురస్కారాలు దక్కాయి. వీరిలో నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ ఉన్నారు.









