Jr NTR | టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) ప్రమాదానికి గురయ్యారని బుధవారం ఉదయం నుండి సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం జరిగింది. ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారని, ప్రస్తుతం ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కథనాలు వచ్చాయి.
అయితే జరుగుతున్న ప్రచారం పై ఎన్టీఆర్ టీం స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని టీం స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం జిమ్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టు బెణికింది. అయినప్పటికీ ఆయన దేవర (Devara) షూటింగ్ లో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు, దయచేసి ఎవరూ ఈ ప్రచారాన్ని నమ్మొద్దని టీం కోరింది. ఇదిలా ఉండగా దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తయినట్లు ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
