Friday 10th April 2026
12:07:03 PM
Home > తాజా > నా పేరుతో వాటికి అనుమతి లేదు: కేటీఆర్ 

నా పేరుతో వాటికి అనుమతి లేదు: కేటీఆర్ 

no permission for organizations on my name, says ktr


– కార్యకర్తలకు కీలక విజ్ఞప్తి!

 KTR Message To Fans | తన పేరు మీద వివిధ సంఘాలు, సేవా సంస్థలు ఏర్పాటు చేయడంపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టతనిచ్చారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు తాను అనుమతి ఇవ్వలేదని ఆయన తేల్చి చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది ‘కేటీఆర్ సేవా సమితి’ మరియు ఇతర పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఆయన, ఇలాంటి ప్రయత్నాలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించనని స్పష్టం చేశారు.

తన పేరుతో సాగుతున్న ఏ సంస్థకూ ఎటువంటి అధికారిక గుర్తింపు లేదని, అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తక్షణమే తన పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

తనపై అభిమానం ఉన్నవారు, ప్రజలకు సేవ చేయాలనుకునే వారు ఎవరైనా సరే బిఆర్ఎస్ పార్టీ పరిధిలోనే ఉండి పనిచేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీకి అతీతంగా కొత్త సంఘాల ఏర్పాటు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అభిమానం చాటుకోవడానికి పార్టీ వేదికను వాడుకోవాలని, సొంతంగా సంస్థలను ఏర్పాటు చేసి గందరగోళానికి గురిచేయవద్దని కేటీఆర్ ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు.

You may also like
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tgspdcl
ఏప్రిల్ 8 నుంచి విద్యుత్ ఆర్టిసన్ల నిరవధిక సమ్మె!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions