BJP New President | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ (Nitin Nabin) ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికలో ఒక్కటే నామినేషన్ దాఖలైంది.
దీంతో నితిన్ నబిన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీజేపీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం 45 ఏళ్ల వయసున్న నితిన్ నబిన్, జేపీ నడ్డా (JP Nadda) తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు.
మంగళవారం ఆయన ప్రమాణం స్వీకారం చేయనున్నారు. 1980 మే 23న రాంచీలో జన్మించిన నితిన్ నబిన్, సీనియర్ బీజేపీ నేత నబిన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. 2006లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, బాంకిపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు.
బీహార్ (Bihar) ప్రభుత్వంలో రహదారులు, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, న్యాయ శాఖల మంత్రిగా పనిచేశారు. యువమోర్చా నుంచి ఎదిగిన నితిన్ నబిన్, సంస్థాగత నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించి చివరకు జాతీయ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు.









