New Railway Line For Capital Amaravati | ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం అయ్యింది. ఈ మేరకు రాజధాని పనులను పునః ప్రారంభించారు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమరావతి గుడ్ న్యూస్ ( Good News ) చెప్పింది. హైదరాబాద్ ( Hyderabad ), చెన్నై ( Chennai ) సహా దేశంలోని ప్రధాన నగరాలను అమరావతికి కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ( Ashwini Vaishnaw ) ప్రకటించారు.
ఈ మేరకు రూ.2,245 కోట్ల అంచనాతో 57 కి.మీ మేర కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కి.మీ. మేర పొడవైన వంతెనను నిర్మించనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసందానిస్తూ ఈ రైల్వే లైన్ ఏర్పాటు కానుంది.