Nani To Present Megastar Srikanth Odela Film | మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ప్రధాన పాత్రలో ‘దసరా’ ఫెమ్ శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela ) కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాను నాచురల్ స్టార్ ( Natural Star Nani ) నాని స్వయంగా సమర్పిస్తున్నారు. ఈ మేరకు సినిమా ప్రీలుక్ ( Pre Look ) ను నాని మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెత్తురోడుతున్న చిరు చేతి ఆసక్తిని రేకెత్తించింది. ‘ అతడు హింసలోనే శాంతిని వెతుకుంటున్నాడు’ అని పోస్టర్ పై కాప్షన్ ను రాశారు.
దీన్ని ఎస్ ఎల్ వి పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రీలుక్ రిలీజ్ చేసిన నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘ చిరంజీవి స్పూర్తితో పెరిగాను. ఆయన సినిమాల టికెట్ల కోసం గంటల తరబడి లైన్లో నిల్చున్నా, కానీ ఇప్పుడు ఆయన సినిమాను సమర్పిస్తున్నా. జీవితం పరిపూర్ణం అయ్యింది’ అని నాని పేర్కొన్నారు.