Thursday 26th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీ వేదికగా బాలయ్యకుఅరుదైన గౌరవం!

ఢిల్లీ వేదికగా బాలయ్యకుఅరుదైన గౌరవం!

award for balayya

Honor To Balayya | ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) జాతీయ స్థాయిలో ఘన గౌరవం దక్కింది.

భారతీయ చలనచిత్ర రంగానికి ఐదు దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న అసమాన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’  పురస్కారం లభించింది. దేశ రాజధానిలో బుధవారం ప్రారంభమైన ‘అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ (IFFD) 2026’ వేడుకల్లో ఆయన ఈ అవార్డును స్వీకరించారు.

ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ‘భారత్ మండపం’లో నిర్వహించిన ఈ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్యతో పాటు సీనియర్ నటి షర్మిలా ఠాగూర్, లెజెండరీ నటుడు ధర్మేంద్ర తరఫున ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భగవంత్ కేసరి’ ని ప్రదర్శించనున్నారు.  

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions