Nampally Court Serious On Konda Surekha | రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో బీఆరెస్ ( Brs ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( Ktr ) నాంపల్లి కోర్టులో రూ.100 కోట్ల పరువునష్టం దావా వేసిన విషయం తెల్సిందే.
తాజగా విచారణ చెపట్టిన న్యాయస్థానం, మంత్రికి మొట్టికాయలు వేసింది. ఓ బాధ్యత కలిగిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని కోర్టు తెలిపింది.
ఈ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి ఫ్లాట్ ఫార్మ్ ల నుండి తొలగించాలని ఆదేశించింది. మరోసారి కేటీఆర్ పై అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి తనపై, సాటి మహిళ సమంత ( Samantha ) మీద ఎలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిందో.. తన నోటితో కోర్టులో చెప్పలేననని కేటీఆర్ అన్నారు.