Mudragada News| సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham ) రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.
గురువారం ఉదయం ఎంపీ, వైసీపీ ( Ycp ) రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ( Mithun Reddy ) ముద్రగడ ను ఆయన నివాసంలో కలిశారు. సీఎం జగన్ ( Cm Jagan ) ఆదేశాల మేరకే ముద్రగడతో భేటీ అయినట్లు తెలిపారు మిథున్ రెడ్డి.
ఈ నేపథ్యంలో ముద్రగడ వైసీపీ లో చేరుతారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ముద్రగడ మాత్రం తనకున్న ఇతర అవకాశాలను కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కనుక టీడీపీ ( Tdp ), జనసేన ( Janasena )పార్టీలతో పొత్తు పెట్టుకోకపోతే మాత్రం ముద్రగడ కాషాయ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరిగా వెళ్తే తెలంగాణ ( Telangana )లో బీసీ సీఎం ( BC Cm ) నినాదం తో ఏ విదంగానైతే ఎన్నికలకు వెళ్లాయో అదే తరహాలో ఏపీ లో కూడా కాపు ముఖ్యమంత్రి నినాదంతో వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ ఊహాగానాలు నడుమ ముద్రగడ బీజేపీలో చేరితే ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారనే కథనాలు కూడా వచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం ఏపీ బీజేపీ ( Ap Bjp ) నేతలు కూడా ముద్రగడ తో భేటీ అయ్యారు.
దింతో సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రాలో ఎటువంటి పొత్తు లేకుంటే తాను బీజేపీ చేరుతానని లేదంటే వైసీపీ లో చేరుతానని ఎంపీ మిథున్ రెడ్డికి ముద్రగడ స్పష్టం చేసినట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం.