Dhoni Comments On Retirement | ఐపీఎల్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రాణం ఎంఎస్ ధోనీ (MS Dhoni) తన రిటైర్మెంట్పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
44 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు పోటీనిస్తూ ఫిట్నెస్తో అలరిస్తున్న ధోనీ.. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలకు తనదైన శైలిలో చెక్ పెట్టారు.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన సీఎస్కే ఫ్యాన్ ఈవెంట్లో ధోనీ సందడి చేశారు. ఈ వేడుకలో తమిళ నటుడు శివకార్తికేయన్ ఒక ఆసక్తికర విన్నపం చేశారు. “రిటైర్మెంట్ ఆలోచనలు పక్కనపెట్టి, మరికొన్నేళ్లు పసుపు జెర్సీలో మమ్మల్ని అలరించండి” అని ధోనీని కోరారు.
దీనికి ధోనీ నవ్వుతూ బదులిస్తూ.. “ప్రస్తుతం 44ఏళ్ల వయసులో ఫిట్నెస్ కాపాడుకోవడం సవాలే.. అయినా కంగారు పడకండి, నేను 60ఏళ్ల వరకు ఆడినా ఆశ్చర్యపోవద్దు” అని వ్యాఖ్యానించారు. ధోనీ నోటి నుంచి ఈ మాట రాగానే స్టేడియం మొత్తం ‘ధోనీ.. ధోనీ..’ నినాదాలతో మారుమోగిపోయింది.
సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ఇప్పటికే ధోనీ 2026 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. అయితే, జట్టులో ధోనీ పాత్ర ఇప్పుడు వ్యూహాత్మకంగా మారుతోంది. రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలు అప్పగించిన ధోనీ, ఇప్పుడు కేవలం ఫినిషర్‌గా మెరుపులు మెరిపిస్తున్నారు.
జట్టులోకి సంజు శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు రావడంతో, వికెట్ కీపింగ్ బాధ్యతల్లోనూ ధోనీకి వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. రూల్స్ ధోనీకి అనుకూలంగా ఉండటంతో, ఆయన మరికొంత కాలం మైదానంలో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.
2025 సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సీఎస్కేను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ధోనీ అనుభవం ఇప్పుడు అత్యంత కీలకం. క్రీడా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, 2026 సీజన్ ఈ దిగ్గజానికి ఘనమైన వీడ్కోలు పలికే ‘లాస్ట్ చాప్టర్’ అయ్యే అవకాశం ఉంది.






