Morne Morkel | టీం ఇండియా (Team India) బౌలింగ్ కోచ్ గా సౌత్ ఆఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel) నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ(BCCI) కార్యదర్శి జై షా (Jai Shah) బుధవారం ప్రకటించారు.
సెప్టెంబర్ 1 నుండి మోర్కెల్ కాంట్రాక్టు ప్రారంభమవనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 19 నుండి భారత్, బంగ్లాదేశ్ ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ఈ సిరీస్ నుండి మోర్కెల్ కోచ్ గా తన జర్నీ ని మొదలెట్టనున్నారు.
ఇదిలా ఉండగా టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో మోర్కెల్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఐపీఎల్ లో భాగంగా 2014లో కేకేఆర్ ట్రోఫీని గెలిచింది.
ఈ సమయంలో గంభీర్ (Gambhir) కోల్కత్త కెప్టెన్ గా ఉంటే, మోర్కెల్ టీంలో కీలకంగా వ్యవహరించాడు. అలాగే లక్నో టీంకు గంభీర్ మెంటర్ గా వ్యవహరించిన సమయంలో కూడా మోర్కెల్ ఆ టీం బౌలింగ్ కోచ్ గా సేవలు అందించాడు