– మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ బొగ్గారపు
– కేబీకే హస్పిటల్ సేవలను ప్రశంసించిన దయానంద్
ప్రతి మనిషికి వెలకట్టలేని అత్యంత విలువైన అవయవాలను అర్ధాంతరంగా తొలగించకుండా పరిరక్షించాలనే ఉద్దేశంతో కేబీకే హాస్పిటల్ చేపట్టిన సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్ అనే క్యాంపెయిన్ కు అనూహ్య స్పందన లభిస్తోంది.
అనేక దీర్ఘకాలిక వ్యాధుల వల్ల అవుతున్న అవయవ విచ్ఛేదనను అరికట్టాలనే లక్ష్యంతో అత్యాధునిక చికిత్స అందిస్తున్న కేబీకే హాస్పిటల్ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.
ఈ ప్రచారానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు తమ మద్దతు ప్రకటించారు. కేబీకే హాస్పిటల్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు.
Read Also: Save Organs Save Life: KBK Hospital ఆధ్వర్యంలో నెల రోజులు ఉచిత హెల్త్ క్యాంప్!
తాజాగా ఈ సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్ క్యాంపెయిన్ కు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ కూడా మద్దతు పలికారు. ఈ సందర్భంగా సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్ క్యాంపెయిన్ కు సంబంధించిన పోస్టర్ ను శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
దీర్ఘకాలిక వ్యాధులకు ఆంప్యుటేషన్స్ అవసరం లేకుండా చికిత్స అందిస్తున్న కేబీకే హాస్పిటల్ సేవలను ఆయన ప్రశంసించారు. కేబీకే హాస్పిటల్ ఉచిత హెల్త్ క్యాంప్ లు కూడా నిర్వహించడం అభినందనీయం అన్నారు.
కేబీకే హాస్పిటల్ పేద ప్రజలకు అందుబాటులో మరిన్ని వైద్య సేవలు అందించాలని సూచించారు. సేవ్ ఆర్గాన్స్ క్యాంపెయిన్ కు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కేబీకే గ్రూప్ ఫౌండర్, చైర్మన్ కక్కిరేణి భరత్ కుమార్, జేసీఐ సూపర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ నిఖిల్ గుండా తదితరులు పాల్గొన్నారు.