MLA Vijayudu Vs MP Mallu Ravi protocol Fight in Jogulamba Gadwal | నాగర్ కర్నూల్ ఎంపీ, కాంగ్రెస్ నేత మల్లు రవి-అలంపూర్ ఎమ్మెల్యే, బీఆరెస్ నాయకులు విజయుడు మధ్య తోపులాట జరిగింది. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం అనంతరం కాస్త ఘర్షణకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులో సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వల పనులకు మంగళవారం సాయంత్రం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. అయితే శంకుస్థాపన పనులకు కొబ్బరికాయ కొట్టే సమయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అనంతరం అది ఘర్షణకు దారితీసింది. మల్లు రవి-విజయుడు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో కలగజేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను పంపించివేశారు.










