Rajasingh Challenge To Kishan Reddy | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
రాజీనామా చేయకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీకి, కేంద్రమంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే.. తానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
ఒకేచోటు ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దాం.. ఎవరు గెలుస్తారో చూద్దామని సంచలన సవాల్ విసిరారు. అయితే బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వస్తే మాత్రం వెళ్లి కలుస్తానని చెప్పారు.
వాళ్లకు వాళ్లుగా పిలిస్తేనే వెళ్లి మళ్లీ పార్టీలో చేరుతాననీ, ఆ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజాసింగ్ తెలిపారు.
ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు రబ్బర్ స్టాంపుగా మారరని విమర్శించారు. బీజేపీ కొత్త కమిటీలో అంతా హైదరాబాద్ కు చెందిన నేతలే ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఈ కమిటీని రాంచందర్ రావు వేశారా.. కిషన్ రెడ్డి(Kishan Reddy) వేశారో తెలియడం లేదన్నారు. ఈ కమిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు రాజా సింగ్.









