Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > మహేశ్ బాబు 50వ బర్త్ డే.. చిరంజీవి, వెంకటేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

మహేశ్ బాబు 50వ బర్త్ డే.. చిరంజీవి, వెంకటేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

chiranjeevi birthday wishes to mahesh babu

Chiranjeevi Tweet on Mahesh Birthday | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Superstar Mahesh Babu) శనివారం నాడు తన 50వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్బంగా సినీ ప్రముఖుల నుంచి మహేశ్ బాబుకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ఆయనకు మహేశ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. “50వ పుట్టినరోజు శుభాకాంక్షలు మహేశ్. తెలుగు సినీ పరిశ్రమకు మీరు గర్వకారణం. ఏళ్లు గడిచేకొద్దీ యంగ్ అవుతున్నావు. ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తాను” అని చిరంజీవి పోస్ట్ చేశారు.

“పుట్టినరోజు శుభాకాంక్షలు మహేశ్. 50 ఏళ్లు వచ్చినా నువ్వు నాకు ఎప్పటికీ చిన్నోడివే. నువ్వు ఎంతోమందికి స్ఫూర్తి. నీ తర్వాత సినిమాలో సృష్టించే మ్యాజిక్ కోసం వేచి చూస్తున్నా” అంటూ వెంకటేశ్ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే మహేశ్ అన్న. ఎన్నో విజయాలు అందుకోవాలంటూ జూ. ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా, మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అతడు సినిమా రీరిలీజ్ చేశారు.

You may also like
ssmb 29 update
మహేశ్ బాబు బర్త్ డే: SSMB29 అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions