Manmohan Singh Death News | భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వయస్సు రీత్యా తలెత్తిన సమస్యల కారణంగా దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ 92వ ఏటా మరణించారు.
26 సెప్టెంబర్ 1932 లో అప్పటి పంజాబ్ ప్రావిన్స్ లో అతి సాధారణ కుటుంబంలో మన్మోహన్ జన్మించారు. 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆయన ఉర్దూ మీడియంలోనే విద్యను అభ్యసించారు. దేశ విభజన అనంతరం ఆయన కుటుంబం పంజాబ్ కు వచ్చింది.
ఆ తర్వాత 1948 లో అమృత్సర్ లో స్థిరపడ్డారు. కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ ఆ తర్వాతి కాలంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మౌన ముని అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ఆయన మాత్రం తన పని తాను చేసుకుని వెళ్లిపోయేవారు.
2004 నుండి 2014 వరకు మన్మోహన్ హయాంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, అమెరికాతో అణు ఒప్పందం, విద్యా హక్కు, ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డు వంటిని ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయి.
అలాగే మంగళయాన్, చంద్రయాన్ మరియు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మన్మోహన్ హయాంలోనే జరిగాయి. ఇదిలా ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.