- ఏప్రిల్ 3 నుంచి మే 30 వరకు..
- హెల్త్ క్యాంప్ ను ప్రారంభించనున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల ఆంప్యుటేషన్స్ కి కారణమవుతున్న అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో అత్యాధునిక ట్రీట్ మెంట్ అందిస్తోంది హైదరాబాద్ లోని కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. (KBK Hospital)
ఈ ఆసుపత్రిలో మాత్రమే లభించే అత్యున్నత చికిత్స ద్వారా ఎంతో మంది అవయవాలను పరిరక్షించిన కేబీకే హాస్పిటల్ తాజాగా మరో గొప్ప సంకల్పానికి పూనుకుంది.
గ్యాంగ్రీన్, డయాబెటిస్ ఫుట్ అల్సర్స్, సెల్యూలైటిస్, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు తదితర వ్యాధుల నుంచి అవయవాలను కాపాడాలనే సదుద్దేశంతో సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్ (Save Organs.. Save Life) అనే నినాదంతో జేసీఐ సూపర్ హైదరాబాద్ తో కలిసి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్స్ ప్రోగ్రామ్ కు సంబంధించిన పోస్టర్ ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (Devireddy Sudheer Reddy) ఆవిష్కరించారు.

అవయవ విచ్ఛేధనం చేయాల్సిన అవసరం లేకుండానే ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తున్న కేబీకే హాస్పిటల్ సేవలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఆయా వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్న కేబీకే హాస్పిటల్ సేవలు ప్రశంసనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో కేబీకే గ్రూప్ (KBK Group) ఫౌండర్, చైర్మన్ కక్కిరేణి భరత్ కుమార్ , జేసీఐ సూపర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ నిఖిల్ గుండా, కేబీకే గ్రూప్ డైరెక్టర్ విశాఖ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సేవ్ ఆర్గాన్స్ .. సేవ్ లైఫ్స్ లక్ష్యంతో ఆంప్యుటేషన్స్ అక్కర్లేని చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది కేబీకే హాస్పిటల్.
హయత్ నగర్ శాఖలో ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు 30 రోజుల పాటు నిరంతరాయంగా ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనుంది.
ఈ హెల్త్ క్యాంప్ ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. హయత్ నగర్ పరిసర ప్రజలంతా ఈ 30 రోజుల ఉచిత మెగా హెల్త్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోవాలని కేబీకే హాస్పిటల్ యాజమాన్యం పిలుపునిస్తోంది.