Lawrence Bishnoi Vs Salman Khan | సినిమా షూటింగ్ లో భాగంగా రాజస్థాన్ జోధ్పూర్ ( Jodhpur ) లో కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ ( Salman Khan ) వేటాడి చంపారనే కారణంతో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ( Lawrence Bishnoi ) బాలీవుడ్ స్టార్ హీరోపై పగ పెంచుకున్నారు.
సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని హెచ్చరించారు. 1998లో కృష్ణ జింకను హత్య చేశారని సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ కమ్యూనిటీ ( Bishnoi Community ) కేసును నమోదు చేసింది. బిష్ణోయ్ వర్గం కృష్ణ జింకను అత్యంత పవిత్రంగా భావిస్తారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ కూడా ఇదే కమ్యూనిటికి చెందినవాడు.
ఇప్పటికే సల్మాన్ ఖాన్ అత్యంత సన్నిహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ( Baba Siddique )ని బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma )ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
కృష్ణ జింకను చంపినందుకు పగ తీర్చుకోవాలని గ్యాంగ్ స్టార్ గా మారిన లాయర్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ను హత్య చేయాలని చూస్తున్నాడు. ఫేస్ బుక్ ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్ లోకి 700 మందిని చేర్చుకున్నారు.
కానీ, పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ ని పట్టుకోలేరు. ఎందుకంటే అతడు ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. ఇలాంటి సినిమా కథను రాస్తే ఎవరూ నమ్మలేరని ఆర్జీవి ఎక్స్ ( X )వేదికగా పోస్ట్ చేశారు.