– ఫిబ్రవరి 1 నుంచి ఆ వెరిఫికేషన్ అక్కర్లేదు!
No KYV For Fastag | వాహనాల ఫాస్ట్ ట్యాగ్ (Fastag) వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) శుభవార్త చెప్పింది.
కొత్త ఫాస్ట్ ట్యాగ్‌లకు తప్పనిసరిగా అమలు చేస్తున్న ‘నో యువర్ వెహికల్’ (KYV) ప్రక్రియను 2026 ఫిబ్రవరి 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మార్పు ప్రైవేట్ వాహనాల విభాగానికి మాత్రమే వర్తిస్తుంది. ఇకపై కొత్త ఫాస్ట్ ట్యాగ్ జారీ సమయంలో యాక్టివేషన్ తర్వాత ఎదురయ్యే KYV సమస్యలు ఉండవు. వాహన్ డేటాబేస్ ఆధారంగా ప్రీ-యాక్టివేషన్ దశలోనే వాహన వివరాలను ధ్రువీకరించనున్నారు.
దీంతో ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేషన్ మరింత సులభంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న వాహన యజమానులకు కూడా సాధారణంగా KYV అవసరం ఉండదు.
అయితే తప్పుడు వాహనానికి ట్యాగ్ లింక్ చేస్తే, ఫాస్టాగ్ ను దుర్వినియోగం చేస్తే లేదా ఫిర్యాదులు ఉన్న సందర్భాల్లో మాత్రమే తనిఖీలు చేపడతారు.
ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికులపై ఉన్న భారం తగ్గించి, హైవే ప్రయాణాన్ని మరింత క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా NHAI పేర్కొంది.









