ktr sensational comments on modi
తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ బీఆరెస్ పార్టీ జులై 8న(రేపు) జరగనున్న మోడీ సభను బహిష్కరించనున్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నరనరాన తెలంగాణ పట్ల వ్యతిరేకను జీర్ణించుకున్నారని విమర్శించారు.అలాగే మోడీ తొమ్మిది ఏండ్ల పాలనలో తెలంగాణకు ఎం చేశారు అని ప్రశ్నించారు.
HYDERABAD| హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు.అందులో కేటీఆర్ మాట్లాడుతూ మోడీ పైన విమర్శలు గుప్పించారు.
తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది అని ప్రశ్నించారు.తెలంగాణకు ఇవ్వాల్సిన కోచ్ ఫ్యాక్టరీని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో రూ.20 వేల కోట్లతో అక్కడ ఏర్పాటు చేశారని కాని తెలంగాణకు కేవలం రూ.521 కోట్లనే కోటాయించారని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు వాగ్దానం చేసిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఏమైంది అనిఅడిగారు.తెలంగాణ పట్ల మోడీ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ పాలనలో ఏదైనా పెరిగిందంటే నిరుద్యోగం, అప్పులు మాత్రమేనని విమర్శించారు. రాహుల్ గాంధీ అడ్డగోలు ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆయన ఏ అర్హతతో తమపై విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో రాహుల్ హోదా ఏంటని నిలదీశారు.
అలాగే తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు గుప్పించారు.భూదందాలు చేసే వారు ధరణి గురుంచి మాట్లాడుతున్నారని అన్నారు.అలాగే ధరణి విషయం లో విదేశుల హస్తం ఉంది అని రేవంత్ వ్యాఖ్యలను పట్టించుకునే అవసరం లేదని స్పష్టం చేశారు.
బీఆరెస్ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభిస్తుందని వ్యాఖ్యానించారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం లో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల మరణించిన గాయకుడు, బీఆరెస్ నేత సతీమణి రజినికి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మైన్ పదవి ఇస్తున్నట్లు చెప్పారు.