KTR Old Tweet Viral | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎంపికైన కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గతంలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
బీఆరెస్ అధికారంలో ఉన్న సమయంలో రేవంత్ మరియు కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్ లో జరిగిందో తెల్సిందే. ఈ నేపథ్యంలో 2017, డిసెంబర్ 28న కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గురించి మీరు ఏమనుకుంటున్నారు ? అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించగా, “రేవంత్ ఆ?” ఆయన ఎవరు అంటూ తిరిగి ప్రశ్నించారు కేటీఆర్.
అయితే తాజాగా రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎం గా ప్రకటించడంతో ఆ పాత ట్వీట్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ అభిమానులు కేటీఆర్ ట్వీట్ ను వైరల్ చేస్తూ ఆయన ప్రశ్నకు సమాధానం ఇదే అని పోస్టులు చేస్తున్నారు.
