KTR Gets KCR Blessings | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి, కేటీఆర్ (KTR) జన్మదినం సందర్భంగా గురువారం బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కేటీఆర్ బర్త్ డే విషెస్ చెప్పడానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదిలా ఉండగా తన పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ తన తండ్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ను దీవించిన కేసీఆర్ తన తనయుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి ఫొటో తీసుకన్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మాజీ మంత్రి, జోగినపల్లి సంతోష్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బోయిగూడ లోని ఓ స్కూల్ విద్యార్థులకు 100 బెంచీలు, అదేవిధంగా 6 నుంచి 10వ తరగతి వరకు ఉత్తమ ప్రతిభ కనబర్చిన 20 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.








