Saturday 3rd May 2025
12:07:03 PM
Home > తాజా > కొండా సురేఖకు మరో బిగ్ షాక్

కొండా సురేఖకు మరో బిగ్ షాక్

KTR Files Defamation Case On Konda Surekha | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నటుడు అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) నాంపల్లి కోర్టులో క్రిమినల్ ( Criminal ) పరువునష్టం దావా వేసిన విషయం తెల్సిందే. ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్ తగిలింది.

కొండా సురేఖపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో గురువారం పరువునష్టం దావా వేశారు. కేటీఆర్ తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆరెస్ నేతలు బాల్క సుమన్ ( Balka Suman ), దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, తుల ఉమను సాక్ష్యులుగా పేర్కొన్నారు.

మరోవైపు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.

You may also like
‘మోదీ గారు నాకో సూసైడ్ బాంబు ఇవ్వండి పాక్ తో యుద్ధం చేస్తా’
‘చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా చంద్రబాబు తీరు’
ఫాలోవర్లు తగ్గారని సూసైడ్ చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్
‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా టీ-షర్ట్..అల్లు అర్జున్ వీడియో వైరల్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions