Khel Ratna Awards 2024 | కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రకటించింది. 2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ఎంపిక చేసింది. చెస్ విభాగంలో డి.గుకేశ్, హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను బాకర్ ను ఈ పురస్కారాలు వరించాయి.
అదేవిధంగా 32మందికి అర్జున, ఐదుగురిని ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్న వారిలో 17 మంది పారా అథ్లెట్స్ ఉన్నారు. పారిస్ పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన వరంగల్ కు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి అర్జున అవార్డు వరించింది.
జనవరి 17న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలను అందుకుంటారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.