KCR News Latest | మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు బీఆరెస్ అధినేత కేసీఆర్. బీఆరెస్ నేత కుటుంబానికి కేసీఆర్ అండగా నిలిచిన. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుమార్తె చదువు కోసం ఆర్థిక సహాయం చేశారు. బీఆరెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన కుసుమ జగదీశ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. జగదీశ్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదవడానికి ప్రయత్నిస్తున్న విషయం గురించి పార్టీ నాయకుల ద్వారా కేసీఆర్ తెలుసుకున్నారు. ఆమె మెడిసిన్ చదవడానికి అవసరమైన ఫీజు చెక్కును శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో సుకీర్తికి అందజేశారు. మంచిగా చదువుకోవాలని, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సుకీర్తిని ఆశీర్వదించారు.










