Kazakhstan Plane Crash | కజకిస్థాన్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మృతి చెందినట్లు తెలుస్తోంది.
అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ( Azerbaijan Airlines ) కు చెందిన విమానం బాకు అనే ప్రాంతం నుండి రష్యా రిపబ్లిక్ చెచెన్యా రాజధాని గ్రోజ్ని ( Grozny ) వైపు వెళ్తుంది. అయితే దట్టమైన పొగ మంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించారు.
ఈ క్రమంలో అక్తౌ ( Aktau ) ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ కుప్పకూలింది. ఈ ప్రమాదానికి ముందు ఎయిర్పోర్ట్ చుట్టూ విమానం పలుసార్లు చక్కర్లు కొట్టినట్లు కథనాలు వస్తున్నాయి.
కాగా ప్రమాదం సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో కలిపి మొత్తం 72 మంది ఉన్నారు. మరోవైపు ఆరుగురు మాత్రం ఇప్పటివరకు ప్రాణాలతో బయటపడినట్లు కజకిస్థాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.