Kavitha On Gautam Adani Bribery Case | లంచం ఆరోపణలపై వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పై అమెరికా దేశంలో కేసు నమోదైన విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఈ అంశం యావత్ దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇందులో భాగంగా బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత సంచలన పోస్ట్ చేశారు.
‘ అఖండ భారతంలో అదానికో న్యాయం…ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ??’ అంటూ కవిత నిలదీశారు.
అఖండ భారత్‌ను ప్రచారం చేస్తూ, సెలెక్టివ్ జస్టిస్‌ను అందిస్తారా అని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేసి, నెలల తరబడి విచారణలో ఉంచుతారు, అయితే గౌతమ్ అదానీపై పదే పదే తీవ్ర ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని చర్య తీసుకోకుండా ఆపేది ఏమిటి? అంటూ కవిత ప్రశ్నించారు.