Karnataka DGP Ramachandra Rao suspended after obscene video goes viral | కర్ణాటక రాష్ట్రంలో డీజీపీ హోదాలో ఉన్న పోలీసు అధికారి కే.రామచంద్రరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. డీజీపీ కార్యాలయంలోనే మహిళలతో రాసలీలలు జరుపుతున్నట్లుగా ఉన్న పలు వీడియోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. డీజీపీ హోదాలో ఉన్న రామచంద్రరావు కర్ణాటక సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్‌గా విధుల్లో ఉన్నారు. అయితే డీజీపీ కార్యాలయంలో పోలీసు యూనిఫార్మ్ లోనే ఆయన మహిళలతో అత్యంత సన్నిహితంగా ఉన్నట్లుగా కనిపిస్తున్న పలు వీడియోలు బయటకు వచ్చాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎబ్బెట్టుగా మారింది. దింతో అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగిగా అత్యున్నత స్థానంలో ఉన్న రామచంద్రరావు నిబంధనలను ఉల్లంఘించారని జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. సస్పెన్షన్ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వాటర్స్ ను విడిచి వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇకపోతే వైరల్ గా మారిన వీడియోలపై స్పందించిన ఈ డీజీపీ హోదా అధికారి అవి ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆధారంగా రూపొందించారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా జైలులో ఉన్న కన్నడ నటి రన్యారావు తండ్రి ఇతనే. అప్పట్లో ఆమెకు సహకరించారనే ఆరోపణలను ఎదురుకున్నారు.









