Japanese Son Reunites With Indian Father After 19 Years | భారత్ లో ఉన్న తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడు జపాన్ ( Japan ) కు చెందిన ఓ కుమారుడు. 19 ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు తర్వాత ఆ తండ్రీ కొడుకుల కలయిక అందరీ హృదయాలను హత్తుకుంది.
పంజాబ్ అమృత్ సర్ ( Amritsar ) కు చెందిన సుఖ్ పాల్ సింగ్ ( Sukhpal Singh ) థాయిలాండ్ ( Thailand ) దేశంలో సాచీ ( Sachie ) అనే జపనీస్ మహిళను 2002లో వివాహం చేసుకున్నారు. అనంతరం వారు జపాన్ రాజధాని టోక్యో ( Tokyo ) స్థిరపడ్డారు.
2003 వారికి రిన్ ( Rin ) అనే కుమారుడు జన్మించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత దంపతులు విడిపోయారు. ఆ తర్వాత సుఖ్ పాల్ సింగ్ స్వదేశానికి తిరిగొచ్చారు.
దీంతో కుమారుడు రిన్ తండ్రితో మరియు తండ్రి కుటుంబంతో పూర్తిగా సంబంధాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం రిన్ ఒసాకా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ ( Osaka University Of Arts ) లో చదువుతున్నాడు. ఈ సమయంలో వంశ వృక్షం ( Family Tree )అనే ప్రాజెక్టు రిన్ ను తండ్రిని కలిసేలా ప్రేరేపించింది.
అతికష్టం మీద రిన్ తన తండ్రి జాడను కనుగొన్నాడు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 18న పంజాబ్ లోని తన తండ్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తండ్రి, కుమారుల కలయిక భావోద్వేగంగా సాగింది. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు.