Jaggareddy News Latest | సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెల్సిందే.
ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 40 మంది మృతిచెందడం విషాదంగా మారింది. ఈ నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏటా జులై 7న తన జన్మదినం సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుతారు. అయితే సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని జగ్గారెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా లో ప్రమాదం జరగడం, జిల్లా అధికార యంత్రాంగం అంతా సహాయక చర్య ల్లో నిమగ్నమైందని పేర్కొన్నారు. ఇంకా కొంతమంది ఆచూకీ తెలియడం లేదని, ప్రస్తుత ఈ విషాద సమయం లో తన పుట్టినరోజు వేడుకలు జరపడం సరైనది కాదన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులేవ్వరు తన బర్త్ డే వేడుకలు జరపొద్దని, ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టొద్దనీ జగ్గారెడ్డి సూచించారు.