Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇస్రో ఖాతాలో మరో విజయం.. NISAR ప్రయోగం సక్సెస్!

ఇస్రో ఖాతాలో మరో విజయం.. NISAR ప్రయోగం సక్సెస్!

gslv f16

ISRO GSLV F16 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఖాతాలో మరో విజయం చేరింది. బుధవారం సాయంత్రం ఇస్రో చేపట్టిన GSLV-F16 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV-F16 రాకెట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.

ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్  NISAR ఉపగ్రహాన్ని సాయంత్రం 5:40 గంటలకు ప్రయోగించారు. 743 కి.మీ. ఎత్తులో సన్-సింక్రోనస్ ఆర్బిట్లోకి విజయవంతంగా చేరినట్లు ఇస్రో అధికారులు ధ్రువీకరించారు.

ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు భూ ఉపరితలం మీద, అలాగే మంచు కప్పబడిన ఉపరితలాలను, సముద్రాలను చిత్రీకరిస్తుంది. భూమిపై మారుతున్న వాతావరణ పరిస్థితులు, సహజ ప్రమాదాలను పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహం దోహదపడుతుంది.  

You may also like
ISRO
ఇస్రో చరిత్రలో కీలక మైలు రాయి..!
isro eos 8
ఇస్రో ప్రయోగం సక్సెస్.. నిర్దేశిత కక్ష్యలోకి SSLV D3!
కొత్త ఏడాది ఇస్రోకు తొలి విజయం.. ఎక్స్‌ పో శాట్ ప్రయోగం విజయవంతం!
Chandrayaan 3
Chandrayaan 3: చంద్రయాన్‌ కు నేడు కౌంట్‌డౌన్‌ ప్రారంభం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions