Thursday 26th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > హార్మూజ్ జలసంధి.. భారత్‌కు ఇరాన్ ‘బిగ్’ గుడ్ న్యూస్!

హార్మూజ్ జలసంధి.. భారత్‌కు ఇరాన్ ‘బిగ్’ గుడ్ న్యూస్!

Straight of Harmooz

Iran Goodnews To India | పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తమ మిత్రదేశమైన భారత్‌కు భారీ ఉపశమనం కలిగిస్తూ, భారత నౌకల రాకపోకలపై ఉన్న ఆంక్షలను సడలించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అగార్చీ తాజాగా ఈ అంశంపై స్పష్టతనిచ్చారు.

హార్మూజ్ జలసంధిని తాము పూర్తిగా మూసివేయలేదని, కేవలం తమ శత్రు దేశాలకు మాత్రమే ఆ మార్గాన్ని నిలిపివేసినట్లు ప్రకటించారు.

చైనా, రష్యా, భారత్, ఇరాక్ మరియు పాకిస్థాన్.. ఈ ఐదు మిత్రదేశాల నౌకలు హార్మూజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరిపి, అక్కడి సైన్యం నుంచి అధికారిక అనుమతి పొందిన తర్వాతే ఈ నౌకలు ప్రయాణించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్‌పై దాడులకు మద్దతు తెలుపుతున్న దేశాల నౌకలను మాత్రమే అడ్డుకుంటున్నట్లు అగార్చీ తెలిపారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే మిత్రదేశాల నౌకలకు పూర్తి భద్రత కల్పిస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి గుండానే వెళ్తుంది. భారత్ తన చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది.

ఈ మార్గం మూసివేస్తే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇరాన్ తాజా నిర్ణయంతో భారత్‌కు చమురు సంక్షోభం తప్పుతుందనే ఆశలు చిగురించాయి.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions