IPL 2026 Update | టీ-20 వరల్డ్ కప్ ను టీం ఇండియా సాధించి అభిమానులకు అదిరిపోయే కిక్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక ఈ ఐసీసీ మెగా టోర్నీ ముగిసిన కొద్దిరోజుల్లోనే అభిమానులను అలరించేందుకు ఐపీఎల్-2026 (IPL 2026) సీజన్ సిద్ధం అయ్యింది.
మరో రెండు మూడు రోజుల్లో ఐపీఎల్ షెడ్యూల్ విడుదల అవుతుందని బీసీసీఐ కార్యదర్శి దెవజిత్ సైకియా వెల్లడించారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2026 ఎడిషన్ లో భాగంగా బెంగళూరు వేదికగా మార్చి 28న తొలి మ్యాచ్ జరగనుంది.
గత సీజన్ లో ఫైనల్స్ లో తలపడిన బెంగళూరు-పంజాబ్ మధ్య తొలి మ్యాచ్ ఉంటుందని అందరూ భావించారు. కానీ సీజన్ కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వాలని భావిస్తున్న బీసీసీఐ తొలి మ్యాచ్ ను బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరపాపని భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన పంజాబ్ మార్చి 29న గుజరాత్ టైటాన్స్ ను ఢీ కొట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు దశల్లో ఐపీఎల్ షెడ్యూల్ ను విడుదల చేసేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.










