IPL 2025 Retention News | ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ( Mega Auction ) త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో రిటెన్షన్ ప్లేయర్ల ( Retained Players ) లిస్టును ఫ్రాంచైజీలు విడుదల చేసాయి. ఇందులో అత్యధిక ధర రూ.23 కోట్లకు హెన్రిచ్ క్లాస్సేన్ ( Heinrich Klaasen )ను హైదరాబాద్ రిటైన్ చేసుకుంది.
రూ.21 కోట్లకు విరాట్ కోహ్లీ ( Virat Kohli )ని బెంగళూరు అంటిపెట్టుకుంది. రూ.16.30 కోట్లకు రోహిత్ శర్మ ( Rohit Sharma )ను ముంబై రిటెన్షన్ ఆప్షన్ ద్వారా దక్కించుకుంది. కేవలం రూ.4 కోట్లకు ఎంఎస్ ధోనీ ( Ms Dhoni )ని అన్ క్యాపుడ్ ప్లేయర్ గా చెన్నై రిటైన్ చేసుకోవడం ఆసక్తిగా మారింది.
అయితే మరోవైపు స్టార్ ప్లేయర్లను పలు ఫ్రాంచైజీలు వదులుకున్నాయి. ఇందులో ముఖ్యంగా 2024లో కోల్కత్త ( Kolkata )కు ట్రోఫీని అందించిన శ్రేయస్ ఐయ్యర్ ( Shreyas Iyer ) ను కేకేఆర్ వదులుకుంది. అలాగే కేఎల్ రాహుల్ ( KL Rahul ) ను లక్నో, రిషబ్ పంత్ ( Rishab Pant ) ను ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. మాక్స్ వెల్ ( Maxwell ), సిరాజ్ ( Siraj ) లను ఆర్సీబీ వదులుకుంది.