Rohith Sharma | హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohith Sharma) కు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఐపీఎల్ 2025 (IPL 2025) మెగా ఆక్షన్ (ipl auction) లోకి రోహిత్ శర్మ వస్తే, అతన్ని దక్కించుకునేందుకు రెండు ఐపీఎల్ టీంలు ఏకంగా రూ.50 కోట్లు పక్కనపెట్టుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఇదే జరిగితే ఐపీఎల్ హిస్టరీలోనే రోహిత్ సరికొత్త రికార్డ్ ను సృష్టించనున్నారు. రోహిత్ ను దక్కించుకునేందుకు ఢిల్లీ కాపీటల్స్ (Delhi Capitals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Gaints) పెద్దమొత్తంలో పర్స్ మనీ ని సేవ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ తొలి సీజన్ నుండి ఢిల్లీ, గత మూడు సీజన్ లనుండి లక్నో టీంలు ఆడుతున్నా, ఇప్పటికీ ఒక్క ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఒక మంచి కెప్టెన్ కోసం రెండు టీంలు ఎదురుచూస్తున్నాయి. ఐపీఎల్ లో రోహిత్ శర్మకు అద్భుత రికార్డ్ ఉంది, ముంబై కి 5 ట్రోఫీలు అందించిన ఘనత హిట్ మ్యాన్ ది.









