Best Workation Places | ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ 2025 (International Work Place Group 2025) గానూ ప్రపంచంలో అత్యుత్తమ వర్క్ ప్లేసెస్ లిస్టును విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. జపాన్ రాజధాని టోక్యో “వర్క్ కేషన్” కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అగ్రస్థానంలో ఉంది.
ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ మూడవ వార్షిక “వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ బేరోమీటర్”లో భాగంగా ఈ నివేదిక రూపొందించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి వర్క్ కేషన్ నగరాలను ప్రకటిస్తుంది.
బ్రాడ్‌బ్యాండ్ వేగం, రవాణా మౌలిక సదుపాయాలు, భద్రత, సంస్కృతి మరియు కొత్తగా ప్రారంభించిన డిజిటల్ నోమాడ్ వీసా తదితర అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఈ బెస్ట్ వర్క్ కేషన్ జాబితాను విడుదల చేస్తోంది.
2025 నివేదిక ప్రకారం టోక్యో తర్వాత రియో డి జనీరో, బుడాపెస్ట్, సియోల్, బార్సిలోనా, బీజింగ్, లిస్బన్, రోమ్, పారిస్, వాలెట్టా టాప్ 10లో నిలిచాయి. భారత్ నుంచి ముంబై నగరం 36వ స్థానంలో నిలిచింది.





