స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) క్రికెట్ పోటీలను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు సెలక్షన్ కమిటీ విభాగాధిపతి జతిన్ పరంజపే తెలిపాడు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రికెటర్ ఎస్‌కే ఖమ్రుద్దీన్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.
దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు కొంత భిన్నంగా ఉండే ఈ పోటీలను గ్రేస్ బాల్‌కు బదులు టెన్నీస్ బాల్‌తో నిర్వహిస్తామన్నారు. మిగతా ఫార్మాట్ మొత్తం ఐపీఎల్ మాదిరిగానే ఉంటుందన్నారు. ఈ పోటీల్లో రాణించిన వారికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే నేతృత్వంలో క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. వేలం ద్వారా ఒక్కో క్రీడాకారుడికి రూ.3లక్షల నుంచి రూ.50లక్షల ధర పలుకుతుందని చెప్పారు.