Wednesday 16th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > చైనాలో కొత్త వైరస్.. కేంద్రం ఏమన్నదంటే !

చైనాలో కొత్త వైరస్.. కేంద్రం ఏమన్నదంటే !

hmpv in china

New Virus In China | కరోనా వైరస్ (Corona Virus) కు పుట్టినిల్లు చైనాలో (China Virus) మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. HMPV అనే వైరస్ అక్కడ విజృంభిస్తున్నట్లు సమాచారం. హ్యూమన్ మెటానిమో వైరస్ (Human Metapneumo Virus) వేగంగా వ్యాపిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

ఈ వైరస్ బారినపడుతున్న చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో కరోనా పోలిన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చైనాలో ఎమర్జెన్సీ విధించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

కరోనాతో కకవికాలం అయిన ప్రజలు ఈ కొత్త వైరస్ వార్తలతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో HMPV వైరస్ పట్ల ప్రస్తుతానికి ఆందోళన చెందవద్దని ఇండియన్ హెల్త్ ఏజెన్సీ ప్రజలకు సూచించింది.

దేశంలో ప్రస్తుతం అటువంటి వైరస్ జాడ లేదని పేర్కొంది. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తిపై దృష్టి పెట్టాలని నేషనల్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ కి కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

You may also like
rajagopal raju
టాలీవుడ్ నటుడు రవితేజ కుటుంబంలో తీవ్ర విషాదం!
బ్రిటన్ రాజుతో టీం ఇండియా ప్లేయర్లు
భూమిపైకి వచ్చేసిన శుభాంశు శుక్లా
పార్టీ నాయకుడి కుమారుడికి జగన్ నామకరణం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions