Sunday 29th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జోరుగా హిమపాతం.. వృద్ధురాలిని హెలికాప్టర్ లో తరలించిన సైన్యం!

జోరుగా హిమపాతం.. వృద్ధురాలిని హెలికాప్టర్ లో తరలించిన సైన్యం!

indian air force viral video

Indian Air Force Viral Video | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో హిమపాతం జోరుగా కురుస్తోంది. దీంతో మంచు పేరుకపోవడం వల్ల అనేక రహదారులు మూతపడ్డాయి. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మంచు కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లోను బయటకు రావడానికి కుదరడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒక మారుమూల గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలు పెరాలసిస్ స్ట్రోక్ కు గురైంది.

అయితే హిమపాతం వల్ల రోడ్డు మార్గంలో ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆ వృద్ధురాలి కుటుంబం, గ్రామస్థులు కలిసి సైన్యాన్ని సాయం కోరారు. పరిస్థితి వివరించడంతో వెంటనే స్పందించిన అధికారులు.. చీతా హెలికాప్టర్ ను పంపించారు.

విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పటికీ సైనికులు రిస్క్ చేసి ఆ గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వృద్ధురాలిని తీసుకుని చండీగఢ్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. సమయానికి వైద్యం అందటంతో ఆ వృద్ధురాలు ప్రస్తుతం కోలుకుంటోంది.

ఈ సందర్బంగా ఆ వృద్ధురాలి కుటుంబం, గ్రామస్థులు సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధురాలిని ఆసుపత్రికి తరలిస్తున్న వీడియోను ఐఏఎఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.

You may also like
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
old tractor makes a man millionaire overnight
పనికి రాని పాత ట్రాక్టర్ రాత్రికి రాత్రేకోటీశ్వరుడిని చేసింది.. ఎలాగో తెలుసా!
bravery girl saves toddlers for faulty elevator
లిఫ్ట్ ప్రమాదం నుంచి చిన్నారులను కాపాడిన బాలిక.. వీడియో వైరల్!
scrap dealer returns gold to costumer
బంగారాన్ని చెత్తతో కలిపి అమ్మేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!  

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions