India vs New Zealand First Test | బెంగళూరు ( Bengaluru ) లోని చిన్నస్వామి స్టేడియం ( Chinnaswamy Stadium ) వేదికగా టీం ఇండియా ( Team India ) న్యూజిలాండ్ ( New Zealand ) జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచులో రోహిత్ సేన ఘోర ఓటమిని చవిచూసింది.
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అవ్వడంతో మ్యాచ్ పై భారత అభిమానులు ఆశలు పెంచుకున్నారు. కానీ వారికి నిరాశే మిగిలింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం రెండు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ( Player Of The Match ) గా సెంచరీ హీరో రచిన్ రవీంద్ర ( Rachin Ravindra ) నిలిచారు. మూడు టెస్టుల సీరీస్ లో ఒక విజయంతో కివీస్ టీం ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇదిలా ఉండగా సుమారు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్టు విజయం సాధించింది.
చివరిసారిగా 1988లో భారత్ లో న్యూజిలాండ్ టెస్టు విజయం సాధించింది. మొత్తంగా భారత్ లో కేవలం మూడవ టెస్టు విజయం మాత్రమే.