Hydra News | చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా ( Hydra ) ఉక్కుపాదం మోపుతోంది. నిత్యం ఏదొక నిర్మాణాన్ని నేలమట్టం చేస్తూ హైడ్రా హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ సినీ నటుడు నాగార్జున ( Akkineni Nagarjuna ) కు చెందిన ఎన్ కన్వెన్షన్ ( N Convention ) ను నేలమట్టం చేయడంతో అందరి చూపు హైడ్రా వైపు మళ్లింది. ఈ క్రమంలో కూల్చివేసిన నిర్మాణాలు, స్వాధీనం చేసుకున్న ఆక్రమిత భూముల నివేదికను హైడ్రా ప్రభుత్వానికి సమర్పించింది.
18 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టినట్లు, ఏకంగా 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పొందుపరిచారు.
ఇందులో నాగార్జున ఎన్ కన్వెన్షన్, ప్రో కబడ్డీ ( Pro Kabaddi ) యజమాని అనపమ, కావేరి సీడ్స్ ( Kaveri Seeds ) ఓనర్ భాస్కర రావు, మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డి, బహదూర్పురా ( Bahadurpura ) ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, దానం నాగేందర్ మద్దతుదారుడు, కాంగ్రెస్ నేత పల్లం రాజు సోదరుడికి చెందిన నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది.