Hydra In Andhra Pradesh | హైదరాబాద్ ( Hyderabad )లోని అక్రమ కట్టడాలను హైడ్రా ( HYDRA ) నేలమట్టం చేస్తోంది. గత కొన్నిరోజులుగా ఏదొక నిర్మాణాన్ని నేలమట్టం చేస్తూ హైడ్రా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
దింతో ఇతర రాష్ట్రాల్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థ వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) మంత్రి నారాయణ ( Narayana ), మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasarao ) కీలక వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం విశాఖలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డు ( Kapuluppada Dumping Yard )ను పరిశీలించారు. అక్కడ సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ ఋషికొండ ( Rushikonda )భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని, త్వరలోనే ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
విశాఖలో పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.