Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > జీరో టోలరెన్స్.. మందుబాబులకు ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్!

జీరో టోలరెన్స్.. మందుబాబులకు ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్!

Drunken Drive: AI-Generated Representative Image

  • రెండు రోజుల్లో 364 కేసులు..
  • రికార్డు స్థాయిలో మద్యం మోతాదు!

భాగ్యనగరంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వీకెండ్ మత్తులో జోగుతూ వాహనాలు నడిపే వారిని కట్టడి చేసేందుకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

కేవలం రెండు రోజుల్లోనే (మార్చి 13, 14 తేదీల్లో) ఏకంగా 364 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. టూ వీలర్లదే పైచేయి.. డేంజర్ లెవల్స్‌లో ‘మత్తు’ పోలీసులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, పట్టుబడిన వారిలో అత్యధికులు ద్విచక్ర వాహనదారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

టూ వీలర్లు: 313 మంది
ఆటోలు: 25 మంది
కార్లు మరియు ఇతర వాహనాలు: 26 మంది

మరింత విచారకరమైన విషయం ఏమిటంటే, మద్యం మోతాదును కొలిచే BAC Levels కొందరిలో 300 పైన నమోదయ్యాయి. సాధారణంగా 30 పైన ఉంటేనే కేసు నమోదు చేస్తారు, కానీ 300 దాటడం అంటే అది ప్రాణాంతకమైన స్థితి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

‘జీరో టోలరెన్స్’..

నిరంతర తనిఖీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల ‘జీరో టోలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

ఈ తనిఖీలు కేవలం వీకెండ్స్‌కే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగుతాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) వెల్లడించారు.

రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్సుల రద్దుకు కూడా సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.

నగర ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, మద్యం సేవించినప్పుడు ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions