Hyderabad Metro | నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 31న మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు తెలిపింది.
అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. బుధవారం ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటిగంటకు మెట్రో రైళ్లు బయలుదేరతాయని అధికారులు తెలిపారు.
మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.









