Hyderabad CP VC Sajjanar News | కర్ణాటక రాష్ట్రంలోని నెలమంగళలో మూడు రోజుల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆర్టీసీ బస్ ను ఓవర్టేక్ చేసే క్రమంలో ఓ పికప్ వాహనం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులు, పికప్ వాహన డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ క్రమంలో సదరు ప్రమాదంపై స్పందించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
అందరికీ ఈ పికప్ వాహన డ్రైవర్ కు ఉన్నట్టు అదృష్టం ఉండదు కదా అని హితవుపలికారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమాత్రం ‘నిర్లక్ష్యం’ వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డ్రైవింగ్ సీటులో ఉన్నప్పుడు దృష్టంతా రోడ్డుపైనే ఉండాలని ‘పర్లేదులే.. చూసుకోవచ్చులే’ అనే అతివిశ్వాసం ప్రాణాల మీదకు తెస్తుందన్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనర్ పేర్కొన్నారు.
Watch Video Here | https://x.com/i/status/2012186373265244205









